సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా జంతువులు, పక్షులు, పాములకు సంబంధిచిన వీడియోలు అయితే ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి.అలాంటి వీడియోలను నెటిజన్లు కూడా తెగ ఇష్టపడుతుంటారు. లైకులు, కామెంట్లు చేస్తూ షేర్‌ చేస్తుంటారు. ఇక కొన్ని వీడియోల్లో చిన్నాపిల్లల అల్లరి, యువతీ యువకుల హంగామా, వృద్ధులు చేసే సహాస విన్యాసాలు సైతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంటాయి. జంతువుల వీడియోల్లో ఎక్కువగా ఏనుగులు, పులి,సింహాలకు సంబంధించి వీడియోలు బాగా వైరల్‌ అవుతుంటాయి. అయితే, ఇక్కడ అలాంటిదే మరో వీడియో షోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఈ వీడియోలో అడవికి రాజైన మృగరాజు ఓ మహిళను చూసి భయంతో దాక్కున్నట్టుగా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియోలో ఒక సింహం వాకింగ్‌ చేస్తున్న మహిళను చూసి పొదల మాటున దాక్కుంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.


 ఓ సింహం ఇంటి ముందు ఉన్న పొదల్లో కూర్చుని ఉంది. అదే సమయంలో ఒక మహిళ రోడ్డుపై జాగింగ్ చేస్తోంది. అడవి జంతువులు మనుషులు కనిపిస్తే చాలు..ఆహా.. మంచి ఆహారం లభించినట్టే అనుకుంటాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేటసాగిస్తాయి. కానీ, అతి తక్కువ సందర్భాలలో మాత్రమే అడవి జంతువులు మనుషులను చూసి బెదురుకుంటాయి. బెదిరింపులకు గురైనప్పుడు మాత్రమే అవి ప్రతిస్పందిస్తాయి. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. పొదల్లో దాక్కున్న ఆ సింహం జాగింగ్ చేస్తోన్న మహిళని భయపడిపోయిందో ఏమో తెలియదుగానీ, ఆమె చూస్తూ అలాగే ఉండిపోయింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా షేర్‌ చేసిన ఈ వీడియోని నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు. షేర్ చేసినప్పటి నుండి 41,000 కంటే ఎక్కువ మంది చూశారు. కాగా 1,900 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. 300 మందికి పైగా వినియోగదారులు ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. అనేక మంది వినియోగదారులు పోస్ట్‌పై రకరకాల కామెంట్స్‌ చేస్తు్న్నారు. ఇది ఖచ్చితంగా అద్భుతమని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: