సాధారణంగా అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన జంతువులలో పులి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఒక్కసారి పులి పంజా విసిరింది అంటే దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యమే. ఇక సాధు జంతువులైన ఆవు లాంటివి పులి బారిన పడితే ఇక తప్పించుకోవడం కాదు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా ఒక ఆవుపై పులి దాడి చేసింది. అయితే ఇది గమనించిన మిగతా ఆవులు గుంపుగా వెళ్లి పులి పై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో ప్రమాదకరమైన పులి సైతం అక్కడి నుంచి పరార్ అయింది.
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ వీడియోలో ఏముంది అంటే.. ఒక ఆవుల మంద అక్కడ కనిపిస్తుంది. అయితే ఒంటరిగా ఉన్న ఆవుపై అక్కడే పొదల్లో నక్కి ఉన్న పులి పంజా విసిరింది. ఈ క్రమంలోనే ఆహారంగా మార్చుకోవాలని అనుకుంది. కానీ ఆవు చావు కేకలు వేయక ఇక మిగతా ఆవులన్నీ కూడా భయపడలేదు. చెల్లాచెదురుగా అటు ఇటు పారిపోలేదు. క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందడుగు వేసాయ్. ఆవుల మంద ధైర్యానికి పులి బెదిరింది. చివరికి ప్రమాదకరమైన పులి వెనకడుగు వేసి పొదల్లోకి పారిపోయింది. ఇది చూశాక ఐక్యమత్యం ఎంత బలం అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.