
కానీ నిజం గానే గ్రహాంతర వాసులు ఉన్నాయా లేవా అనే విషయం పై అటు శాస్త్రవేత్తలు కూడా ఏ విషయాన్ని క్లారిటీగా చెప్పలేరు. కానీ ఇక్కడ ఇటీవల అమెరికా లోని మెక్సికో పార్లమెంటు లో మాత్రం ఏకంగా గ్రహాంతర వాసులకు సంబంధించిన మృత దేహాలను ప్రదర్శించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నియాంశం గా మారి పోయింది. ఇది ఒక చారిత్రాత్మక అధ్యాయంగా నిలుస్తుందని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. అయితే భవిష్యత్తులో గ్రహాంతర వాసులపై ప్రజలకు మరింత ఆసక్తి పెరగవచ్చని నిపుణులు కూడా భావిస్తున్నారు.
ఇలా మెక్సికో పార్లమెంటులో అధికారిక కార్యక్రమంలో.. రెండు గ్రహాంతరవాసుల శవాలను ప్రదర్శించారు శాస్త్రవేత్తలు. యు ఎఫ్ వో నిపుణుడు జామి మౌసన్ అధికారికంగా దీనిని ఆవిష్కరించారు. అయితే చిన్న శవాలు 1000 సంవత్సరాల నాటివని. ఇవి పెర్క్ లోని కుచ్చుకో ప్రాంతంలో లభించాయి అంటూ నిర్వాహకులు తెలిపారు. మెక్సికాన్ విశ్వవిద్యాలయంలో యూఏఫ్ఓ నిపుణులు వీటి పై అధ్యయనం చేసినట్లు జామి మౌసన్ చెప్పుకొచ్చాడు. రేడియో కార్బన్ డేటింగ్ ఆధారంగా డిఎన్ఏ ఆధారాలను పొందినట్లు శాస్త్రవేత్తలు చెప్పుకుచ్చారు. ఇవి భూమికి చెందినవి కాదని.. శిలాజాలుగా మారాయని యు ఎఫ్ ఓ నిపుణుడు జామి మౌసన్ చెప్పుకొచ్చాడు. కాగా ఈయన చాలా కాలం నుంచి గ్రహాంతర జీవుల గురించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.