
ఇప్పటికే పాకిస్తాన్లో నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరొకపక్క సింధు జలాల ఒప్పందాన్ని కూడా భారత్ తీసివేయడంతో పాక్ కరువు కాటకాలతో అలమటించేలా కనిపిస్తున్నది. దీంతో పాకిస్తాన్లో సరైన తిండి లేక ప్రజలు బట్ట లేక ఇబ్బందులకు పడుతూ ఉన్నారు. అందుకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. మరొకపక్క పాక్ సంబంధించి ఎగుమతులను కూడా భారత్ నిలిపివేసింది. పాకిస్తాన్లోని పరిస్థితులు చూసి .. వాస్తవ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ.. నాయకులు మాత్రం భారత్ తో యుద్ధం అంటూ గాంబీర్యంగా మాటలు మాట్లాడుతున్నారంటు తెలియజేస్తున్నారు.
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ప్రజల అద్వాన స్థితికి సంబంధించి పాకిస్తాన్లో ఇంత ఘోరమైన పరిస్థితి ఉందా అంటే పలువురి నేటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముందు వారి దేశాన్ని ఈ అద్వాన స్థితి నుంచి కాపాడుకోండి.. అన్నం పెడుతున్న భారతదేశం వంటి వాటిపైన ఉగ్రవాదులతో దాడి చేయించేలా చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. పాకిస్తాన్ కు ఇండియా నుంచి పెద్ద మొత్తంలోనే అవసరమైన కాయగూరలు పండ్లు డ్రైఫ్రూట్స్ వంటివి ఎగుమతి అవుతూ ఉండేవట తాజాగా జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇలాంటివన్నీ కూడా నిలిపివేయడంతో అక్కడ ఈ వస్తువుల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో నిత్యవసర సరుకులు ఇతరత్రా ఉత్పత్తులు కూడా బంద్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతున్నది.