
తాజాగా అలాంటి ఓ దుర్మార్గపు పనికి ఒడిగట్టారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు . ఇద్దరు పసి కందులను మురికి కాలువలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో అశోక్ నగర్ సమీపంలో చోటుచేసుకుంది . స్థానికంగా ఉన్న పెద్ద కాలువలో చెత్త తొలగిస్తూ ఉండగా అక్కడ పారిశుద్ధ్య కార్మికుల కు రెండు పసికందుల మృతదేహాలు కనిపించాయి . వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని వెలికి తీశారు . కాగా చనిపోయిన ఆ శిశువు లు కవలలుగా గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు . శిశువుల వయసు కనీసం రెండు నుంచి మూడు రోజులు ఉంటుంది అంటూ డాక్టర్లు అనుమానిస్తున్నారు.
అంతేకాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు . ఈమధ్య వారంలోపు ఎవరికైతే డెలివరీ అయ్యిందో ..మరి ముఖ్యం కవల పిల్లలు ఎవరికి పుట్టారు అనే విషయాలను హాస్పిటల్స్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రసూతి కేంద్రాలలో పుట్టిన శిశువుల వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది . మానవత్వాన్ని మంటగలిపేస్తున్నారు కొంతమంది మూర్ఖులు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఆ దేవుడు కావాలి అనుకున్న వాళ్ళకి పిల్లల్ని ఇవ్వరు. ఇలా ఒళ్ళు బలిసి కొట్టుకునే వాళ్ళకి పిల్లల్ని ఇస్తారు అంటూ ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు . ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేస్తే రానున్న రోజుల్లో ఎక్కడ చూసినా సరే కుప్పలు తెప్పలుగా పిల్లల శవలు విసిరిపడేసి విచ్చలవిడిగా వాళ్లకు వల్లే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీనిపై కఠిన చట్టం తీసుకురావాలి వాళ్లను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు జనాలు..!