
అయితే ధర్మం -అధర్మం.. పాపం-పుణ్యం..స్వరగం-నరకం.. నీతి - నియమాలు అనేక అంశాల గురించి గరుడ పురాణంలో చాలా చాలా చక్కగా వివరించడం జరిగింది. కాగా గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణం సమీపిస్తున్నప్పుడు అందుకు సంబంధించిన కొన్ని సంకేతాలు కనిపిస్తాయట . అవి ఎలా కనిపిస్తాయి..? ఎలా మనం గమనించాలి..? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
హిందూమతంలోని 18 పురాణాలలో ఒకటే ఈ గరుడ పురాణం . ఇందులో ఒక వ్యక్తి పుట్టుక నుంచి మరణం వరకు అన్ని దశలు వివరించబడినది. కాగా గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించే ముందు కొన్ని కొన్ని సంకేతాలు కనిపిస్తాయట . అవి ఏంటంటే.. గరుడ పురాణం ప్రకారం "ఒక వ్యక్తి మరణించే ముందు అరచేతిపై ఉండే రేఖలు మసకబారడం లాంటివి ప్రారంభిస్తాయట". అంతేకాదు ఒక వ్యక్తి జీవితం ముగియనున్న సమయంలో కొద్దిరోజులు ముందు కలల ద్వారా వారికి కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయట.
మరి ముఖ్యంగా తమ పూర్వికులు తమ కళ్ళల్లో కనిపించడం.. ఏడుస్తున్నట్లు లేదా పారిపోతున్నట్లు కనిపిస్తారట. ఒక వ్యక్తి మరణ ఘడియలు సమీపిస్తున్నప్పుడు అనేక రహస్యమైన విషయాలు కూడా చూడగలుగుతాడట . అంతేకాదు నిప్పు తగలడం వరదలలోకి చుట్టుకోవడం వంటివి కూడా అతని మరణాన్ని దగ్గరికి వచ్చినట్లు సూచిస్తుందట. మరీ ముఖ్యంగా గతంలో తాము చేసిన చెడు పనుల గురించి పదేపదే గుర్తుచేసుకుంటూ ఉన్నా.. మనసులో ఆకస్మిక మార్పులను కలిగి ఉన్నా..మనకి తెలియకుండానే ఏడుస్తూ ఉన్నా..వాళ్లు చేసిన చెడ్డ పనులు అన్నిటికీ గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న.. ఆ వ్యక్తి మనసులో ఏదో తెలియని బాధ అనిపించి తప్పులకు పశ్చాతాపం పడుతున్న.. ఆ వ్యక్తి మరణం త్వరలో సంభవిస్తుంది అని సంకేతమట. గరుడ పురాణం ఇదే చెబుతుంది..!!
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. ఇది ఎంత వరకు విశ్వసించాలి అనేది పూర్తిగా పాఠకుల ఇష్టం ..!