జీవితం మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. అయితే మనమే కొన్ని చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా, వదిలేస్తూ ఉంటాము. కానీ వాటిలోనే ఎంతో అర్ధం ఉంటుంది. ఉదాహరణకు ఒక అహంకారం కలిగిన వ్యక్తి మరియు పొట్ట కలిగిన వ్యక్తి ఎదుటి వారిని కౌగిలించుకోవాలన్నా కుదరదు. అదే విధంగా ఒక కొడుకు ఎప్పటి వరకు తండ్రి అవకుండా ఉంటాడో, అప్పటివరకు తన తండ్రి తీసుకునే ప్రతి నిర్ణయం తప్పుగానే అనిపిస్తుంది. అంటే అనుభవమే మంకుబ్ అన్నీ నేర్పుతుంది. జేబు నిండా డబ్బు ఉంటే మీరు చెడు దారిలో నడిచేలా దిశను మార్చగలుగుతుంది. కానీ ఖాళీగా ఉండే జేబు జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేస్తుంది. కొందరు ప్రతి ఒక్కరిని తన వారిగా భావిస్తారు. అలాంటి వారిని ఎవరూ లెక్క చేయరు.

ఎవరైనా మిమ్మల్ని నీ సొంత వారు ఎవరు అని అడిగితే మీరు ఈ విషయం చెప్పండి. సమయమే నా అసలైన మిత్రుడు అని చెప్పండి. సమయం మనకు సహకరిస్తే అందరూ మనవారే అదే సమయం మనకు సహకరించకపోతే అంతా పరాయి వారే. జీవితంలో ఒంటరిగానే పోరాడవలసి వస్తుంది. జనం నీకు ఓదార్పును మాత్రమే ఇస్తారు. నీతో పాటు కలిసి నడవరు. ఈ ప్రపంచంలో నమ్మకస్తులైన వారు ఎవరు అంటే కన్నతల్లి మాత్రమే. ప్రయాణం ఎక్కడికైనా సరే ఎంచుకోండి. అంతేకానీ దారి సరైనదిగా ఉండేలా చూసుకోండి. నిజంగా నువ్వు జీవితంలో విజయం సాధించాలని అనుకుంటున్నావా ? నీ యొక్క నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడం చాలా అవసరం. మీరు అపజయం పొందితే జనం మిమ్మల్ని చులకనగా చూస్తారు మరియు అవహేళన చేసి మాట్లాడతారు. ఒకవేళ మీరు విజయం సాధిస్తే అదే జనం మిమ్మల్ని చూసి ఈర్ష పడతారు. ఏ వ్యక్తి అయినా అతని సంపాదనతో పేదవాడు అవడు, అతడి అవసరాలను బట్టి పేదవాడు అవుతాడు.  

మిమ్మల్ని మీరు ఎప్పుడూ దురదృష్టవంతులు అని అనుకోకండి. ఎందుకంటే మీరు ప్రతిరోజు కడుపునిండా తినగలుగుతున్నారు. ఎవరైనా పేదవారి పిల్లల్ని అడిగి చూడండి. ఒకసారి ఆకలి కంటే గొప్ప మతం, భోజనం కంటే గొప్ప దేవుడు లేడు మీలో ఎవరైనా సరే ఒక గుడి, మసీదు, మరియు చర్చి నిర్మాణానికి ఒక సిమెంటు సంచి దానం చేసే సమయంలో ఒక్కసారి తప్పక ఆలోచించండి,  మీచుట్టుపక్కల ఆకలితో అలమటించే వారికి ఒక సంచి బియ్యం ఇవ్వడానికి ప్రయత్నించండి. అదే మీరు చేసే గొప్ప దైవ కార్యం. ఇలా నిజమేనా సేవ మరియు సహాయంతోనే మనిషి మనిషిగా ఎంతకాలమైనా బ్రతికి ఉంటాడు. అంతే కానీ మనిషిని ఆదుకొని, ప్రాణాన్ని నిలబెట్టలేని సంపద ఎందుకు వృధా.

మరింత సమాచారం తెలుసుకోండి: