మన దేశంలో పూర్వకాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు కూడా ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు , వ్యవహారాలు అందుబాటులో ఉన్నాయి. మనకు అంతా మంచి జరగాలి అన్నా అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలి అన్నా కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుని విజయాన్ని అందుకోవాలి అన్నా కొన్ని సంప్రదాయాలు మరియు కొన్ని కట్టుబాట్లను పాటించాల్సిందే అని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన జీవితంలో ఎదురయ్యే సమస్యల్లో ఎక్కువగా ఉద్యోగ సమస్యలు అధికమని చెప్పాలి. అయితే వాటిని అధిగమించి విజయాన్ని అందుకోవాలి అంటే కొన్ని పరిష్కారాలను చేయాలి అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అవేంటో ఇపుడు చూద్దాం.

ప్రస్తుతం మనలో చాలా మంది ఎక్కువగా నిరుద్యోగ సమస్యతో సతమత మవుతున్నారు. మీకు కనుక చాలా కాలంగా ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకుండా ఉన్నట్లైతే , మీరు 41 రోజుల పాటు నిరంతరం సూర్య భగవానుడికి ఒక పూజ చేయాలని సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఒక స్పూన్ ఆవాలును సూర్య భగవానుడికి సమర్పించాలి. అలాగే దాహంతో ఉన్న వారికి ఆదివారాల్లో నీటిని విరాళం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం ద్వారా ఆ పుణ్యం మీకు కలిసి వస్తుందట. మీ ఉద్యోగంలో తరచుగా సమస్యలు వస్తున్నట్లు అయితే... ఐదు రాగి పాత్రలలో బసాన్ పిండితో  చేసినటువంటి నేతి మిఠాయిలను నింపి వాటిని లేనివారికి దానం చేయాలి.

ఇలా క్రమం తప్పకుండా కనీసం 11 ఆదివారాలు చేయాలి. అదే విధంగా ప్రతిరోజూ ఉదయం సమయంలో ‘ఓం విఘ్నేశ్వరాయ నమః' అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించడం ద్వారా సమస్యలు తొలగుతాయని పూర్ణాలు చెబుతున్నాయి. అయితే పూజలు పునస్కారాలు చేస్తేనే ఉద్యోగం వచ్చేయదు. దానికి తోడు మీరు బాగా చదువుకుని, ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయి వెళ్ళాలి. మీ ప్రయత్నం గట్టిగా ఉంటే దేవుడు కూడా మీ విజయానికి సహాయపడుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: