ప్రతి మహిళ  బిడ్డని కనాలని, బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవాలని ఎన్నో కలలు కంటుంది. పెళ్లి అయిన  తర్వాత నుండి ఎప్పుడు నెల తప్పుతాన అని ఎదురుచూస్తూనే ఉంటుంది. అందుకు అనుగుణంగా  ప్రతి మహిళ తన శరీరాన్ని గర్భధారణకి అనువుగా ఉంచుకోవాలి. ముందు ఆ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే  చక్కని పిల్లలకి తల్లి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే భార్య భర్తలిద్దరికి సంపూర్ణ ఆరోగ్యం ఉంటే, పిల్లలు కావాలనే కోరిక బలంగా ఉంటే, గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. అయితే గర్భం దాల్చడానికి  భార్య భర్తలు ఇద్దరికి కొన్ని సూచనలు అవసరం.. అవేంటో తెలుసుకోండి.. గర్భం ధరించాలన్న ఆలోచన రాగానే , ముందుగా కుటుంబనియంత్రణ మందులు వాడటం ఆపివెయ్యాలి. 

 

 

 

 

 

కుటుంబనియంత్రణ మాత్రలు మానేసినా, వాటి ప్రభావం వెంటనే పోదు. కొత్త మార్పులకి శరీరం స్థిరపడడానికి రెండు-మూడు నెలలు పట్టవచ్చు. త్వరగా గర్భం దాల్చడానికి  ఈ విషయం ఎంతో ముఖ్యం.భార్యా భర్తలు ఎన్నిసార్లు కలిసినా, సరిగ్గా అండం విడుదలయ్యే ముఖ్యమైన రోజుల్లో సంభోగం జరగకపోతే గర్భధారణ జరగదు. చాలా మంది డాక్టార్లు  చార్ట్ పద్దతి, బేసల్ బాడీ టెంపరేచర్ వంటివి వాడమని సలహా ఇస్తారు.రుతుక్రమం ఖఛ్చితంగా ఉన్న వారికి (28 రోజులు), సాధారణంగా 14వ రోజున అండం ఉత్పత్తి అవుతుంది. కావున, 14వ రోజు మరియు దానికి ముందు నాలుగు రోజుల్లో సంభోగం చేస్తే గర్భవతి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది .ఇంట బోసినవ్వుల పాపాయి రావాలంటే ముందుగా మనసులోని ఒత్తిడిని  తీసివెయ్యాలి. ఒత్తిడి, వేదన, టెన్షన్ అన్నిటిని  తరిమేయాలి.

 

 

 

 

ఆరోగ్యం మీద ధ్యాస పెట్టండి.డాక్టర్ని సంప్రదించి, ఒంట్లో ఏ సమస్యా లేకుండా చూసుకోవాలి. గర్భధారణకు ముందు అవసరమైన విటమిన్స్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలను  డాక్టర్ సలహా తీసుకుని వాడాలి. మంచిపౌష్టికాహారం, మంచినిద్ర చాలా అవసరం. జంక్ ఫుడ్స్,  మసాలాలు తగ్గించి తినండి. సిగరెట్, మత్తుపదార్ధాలు ఇలాంటివి అలవాటుంటే  మానివేయ్యండి. రోజు కొద్ది కొద్దిగా వ్యాయామం చెయ్యండి.స్త్రీలు సంభోగమైన వెంటనే వేడినీళ్లతో స్నానం చేయరాదు. ఆలా చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరిగి, గర్బం ధరించే అవకాశాలు తగ్గవచ్చు.అతి బరువు ఉన్న స్త్రీలు బరువు తగ్గితే వాళ్ళు గర్భవతి అయ్యే అవకాశాలు మెరుగు పడతాయి.అన్నిటి కన్నా తల్లి కావాలనే కోరిక బలంగా ఉండటం చాలా ముఖ్యం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: