అప్పట్లో  ఈ షాంపూలు, కండిషనర్లు ఇవేమి ఉండేవి కాదు.అందరూ కుంకుడుకాయల రసంతోనే తలస్నానం చేసే వారు. కానీ,ఇప్పుడు అందరు షాంపూలతోనే పని కానిచ్చేస్తున్నారు. అయితే, షాంపూలు పడని వాళ్ళు , కుంకుడుకాయల గురించి ఆలోచిస్తున్నారు. ఈ కుంకుడు కాయలు వల్ల జుట్టుకి చేకూరే లాభాలేమిటో ఒక్కసారి చూసేద్దాం రండి.కుంకుడు కాయల రసం నాచురల్ షాంపూగా పని చేస్తుంది. జుట్టుకి పోషణనిస్తుంది. దాంతో, జుట్టు మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది. సిల్కీ, స్మూత్ హెయిర్ లాంటి జుట్టు మీ సొంతమవుతుంది.



స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కుంకుడు కాయలు స్కాల్ప్ ని పూర్తిగా శుభ్రపరుస్తాయి. దాంతో స్కాల్ప్ మీద ఫంగల్ గ్రోత్ ఉండదు. రెగ్యులర్‌గా కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా పోతుంది..కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. జుట్టు చిక్కులు లేకుండా స్మూత్ గా ఉంటుంది.అసలు కుంకుడు కాయలని ఎలా ఉపయోగిస్తారో చుడండి.. !



ఒక పది కుంకుడుకాయ నుండి పెంకు తీయండి.
వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టండి.పొద్దున్నే వడకట్టండి.
షాంపూ లాగా స్కాప్ అంతా మసాజ్ చేయండి. తర్వాత
నీటితో కడిగేయండి. అలాగే మనం కుంకుడు కాయలతో తలస్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి.
తలస్నానం చేస్తున్నప్పుడు కుంకుడుకాయల రసం కంట్లోకి వెళ్ళకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే, వాటిలో ఉండే ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీస్ వలన కళ్ళు మండుతాయి. ఎలర్జీ కూడా రావచ్చు.కుంకుడు కాయలు నాన బెట్టిన తరువాత వాటిని 72 గంటల లోపు వాడేయండి. కుదరకపోతే పారేయండి.కుంకుడు కాయలు వాడిన తరువాత ఏదైనా రాష్ కానీ, స్కిన్ ఎక్కడైనా ఎర్రగా మారడం కానీ, ఇంకేదైనా ఎలర్జీ లక్షణాలు  కానీ కనపడితే వాటిని వాడడం ఆపేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: