గర్భదారణ సమయంలో చాలా మంది ఆడవాళ్లు ఎదుర్కునే ప్రధాన సమస్య అలసట, నీరసం.. గర్భధారణ సమయంలో అలసట అనేది సహజమే. ఎంతో మంది తల్లులకు కూడా ఇలాగే ఉంటుంది. అలసట అనేది గర్భధారణ సమయంలో ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.. !!  గర్భవతి కావడం వలన మీ మొత్తం శరీరంపై ఒత్తిడి అనేది ఉంటుంది. దీని వలన మీరు బాగా అలసిపోతారు. మీరు సాధారణంగా ఆలస్యంగా నిద్ర లేచినాకూడా మళ్ళీ  మీకు సాయంకాలం కూడా నిద్ర వస్తుంది. అందుకనే  మీరు తరచుగా, పగటి పూట స్వల్ప విరామాలను తీసుకునేట్లుగా చూసుకోండి. రోజులో ఎక్కువగా వేడిగా ఉన్నసమయంలో, ప్రత్యేకంగా తడిగా,  చల్లగా ఉన్న రోజులలో విశ్రాంతి తీసుకోండి. రోజంతా కూడా, శుభ్రమైన, సురక్షితమైన నీటిని ఎక్కువగా తీసుకోండి. ఇది మీ శరీరాన్ని గర్భధారణను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే మీ అలసట కూడా తగ్గుతుంది.



గర్భధారణలో మొదటి రోజులలో, మీకు నిరంతరంగా అలసటగా అనిపించవచ్చు. మీ చిన్నారి బిడ్డ ఎదుగుదల కొరకు మీ శరీరం ఎంతో శక్తిని, ఆహారాన్ని వినియోగిస్తూ ఉంటుంది. 3 నెలలు నిండే సరికల్లా మీకు అలసట అనేది తగ్గుతుంది కానీ పగటి పూట పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యము.మీ హార్మోన్ స్థాయిలు అలాగే శక్తి యొక్క ఆవశ్యకత కూడా వేగంగా మారుతూ ఉంటాయి. మీ రక్తంలో చక్కెర, అలాగే  రక్తపోటు కూడా తగ్గిపోవచ్చు. ఇవన్నీ కూడా మీకు అలసట రావడానికి కారణం కావచ్చు.




తక్కువస్థాయిలో ఐరన్ స్థాయిలు ఉండడం కూడా మీరు అలసిపోవడానికి కారణం అవుతుంది.అందుకే ప్రతి రోజూ ఐరన్ మాత్ర వేసుకోమని మీకు వైద్యుడు చెప్పవచ్చు. ఇది తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. మీ ఐరన్ స్థాయిలు మరీ తక్కువగా ఉంటే, మీకు మడం వంటివి జరుగుతాయి. కొంతమంది ఐరన్ మాత్రలు వేసుకుంటే బిడ్డ రంగు నల్లగా మారుతుందనే ఒక మూఢనమ్మకంతో బిళ్ళలు వేసుకోరు.. కానీ ఇది అవాస్తవం. ఐరన్ మాత్రలు మీ శిశువును రంగును నల్లగా మారుస్తాయనేది నిజం కాదు. నిరభ్యన్తరంగా గర్భవతి ఐరన్ అండ్ ఫోలిక్ ఆసిడ్ మాత్రలు వేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: