బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవాలని పెళ్ళైన ప్రతి స్త్రీకి ఉంటుంది. వారి ప్రేమకు, ఆత్మీయతకు గుర్తుగా వారి రక్తం పంచుకొని బిడ్డ పుట్టాలని అందరు అనుకుంటారు. అయితే కొంత మందికి పెళ్లి అయ్యి సంవత్సరాలు గడిచిన పిల్లలు కలగడం లేదు. దీంతో వారు సంతానం లేక మానసికంగా కుంగిపోతున్నారు.  వైద్యులను సంప్రదించి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్ని జంటల్లో సమస్య పురుషుల్లో ఉంటే ఇంకొన్ని జంటల్లో స్త్రీలలో ఉంటుంది. కొందరిలో హార్మోనల్ ఇంబాలెన్స్ కారణంగా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం.. వచ్చినా అది నిలబడక పోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి మహిళలు ఓ సారి ఇలా ట్రై చేస్తే మంచి ఫలితం వస్తుందేమో అంటున్నారు వైద్య నిపుణులు. అదేంటో చూద్దామా.

ఇక రాత్రుళ్లు 8 గంటలు నిద్ర పోవడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా హార్మోన్లు కూడా బ్యాలెన్సింగ్ గా ఉంటాయాని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. హాయిగా 8 గంటలు నిద్రపోయే మహిళలు గర్భవతి అయ్యే అవకాశాలు దాదాపు 91శాతం ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా రాత్రంతా హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేదా మధ్యాహ్నం సమయంలో శృంగారంలో పాల్గొంటే మంచి ఫలితం ఉంటుందని కూడా తెలిపారు.

ఇండియా క్విజ్డ్ వారు దాదాపు 200మంది మహిళలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ మహిళలపై చేసిన పరిశోధన ప్రకారం.. 8 గంటల పాటు నిద్రపోయే స్త్రీలలో దాదాపు 44శాతం మంది గర్భం దాల్చారని తేలింది. 6గంటల పాటు నిద్రపోయి ప్రెగ్నెన్సీ పొందిన వారు 23శాతం మంది ఉన్నారని తెలిపారు. బాగా నిద్రపోయే మహిళల్లో హార్మోన్స్ సమతుల్యత బాగుంటుందని వైద్యులు తెలిపారు. కాబట్టి గర్భధారణ విషయంలో సమస్యలు ఎదుర్కొనే వారు ఇలా ఓ ప్రయత్నించమని వైద్యులు సలహా ఇస్తున్నారు. కేవలం పిల్లల కోసం ప్రయత్నించే మహిళలే కాదు.. ప్రతి మనిషికీ మంచి నిద్ర అవసరమని వైద్య నిపుణులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: