దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ క్లిష్ట సమయంలో గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గర్భవతులైన మహిళలు కరోనా సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గర్భం దాల్చినప్పుడు సహజంగా జరిగే మార్పుల వల్ల గర్భిణి ఊపిరితిత్తుల సామర్థ్యం కొంత తగ్గుతుంది. ఆక్సిజన్‌ మామూలుగా కంటే ఎక్కువగా వినియోగం అవుతుంది. అందువల్ల, వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల గర్భిణులకు సహజంగానే శ్వాససంబంధ వ్యాధుల దుష్పరిణామాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.

మామూలుగా అందరూ తీసుకోవలసిన జాగ్రత్తలే గర్భిణులు కూడా పాటించాలి. తరచుగా సబ్బునీటితో లేక ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌తో చేతుల్ని కడుక్కోవాలి. దగ్గు, తుమ్ములు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలి. కళ్ళు, ముక్కు, నోటిని చేతితో తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. జనసమ్మర్దం ఉన్న చోటుకు వెళ్ళరాదు. వ్యాధి లక్షణాలేమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి. సకాలంలో అవసరమైన పరీక్షల్ని చేయించుకోవాలి.

గర్భంతో ఉన్న వాళ్ళు సాధ్యమైనంతగా ఇళ్లల్లో ఉండడానికే ప్రయత్నించాలని.. చేతులు తరచుగా కడుక్కుంటూ.. సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. కళ్ళను, నోటిని, ముక్కును ముట్టుకోడాన్ని ఆపాలని సూచించారు. పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్ కూడా పెట్టుకోకపోవడమే మంచిదని.. ఎక్కువ మంది ఒక చోట చేరడం సరైన పద్ధతి కాదని ఆమె అన్నారు. నెలలు నిండిన సమయంలో మహిళల్లో శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయన్నారు. అది కరోనా కారణంగా అని పొరపాటు పడకూడదని సూచించారు.

ఒకవేళ సదరు మహిళ విదేశాలకు వెళ్లి వచ్చినా.. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులకు దగ్గరగా ఉన్నట్లు తెలిసినా అలాంటి సమయంలో వెంటనే స్థానిక హెల్త్ అధికారులకు సమాచారాన్ని అందించాలని అన్నారు. అన్ని రకాల టెస్టులు చేయించాలని.. పాజిటివ్ అని తేలితే వైద్యుల సూచనలను పాటించాలని అన్నారు. కరోనా బారిన పడిన వాళ్ళు రెండు మూడు వారాల్లో రికవరీ అవుతారని.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: