సమయం ఏదై నా, కష్టా లు ఏవైనా కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేద ని చాలామంది ప్రముఖు లు, ఎంతో మంది గొప్పవారు మనకు నిరూపించారు.. అలా ఎంతో మంది మహిళల్లో స్ఫూర్తి నింపారు యువ ఐఏఎస్ అధికారిని దివ్య ప్రభ.. బళ్లారి నగర కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆమె ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడి తన సక్సెస్ ని ప్రేక్షకులతో పంచుకున్నా రు..

22 ఏళ్ల వయసులో 2014 సివిల్స్ లో జాతీయస్థాయిలో 82వ ర్యాంకు సాధించి ఐఏఎస్ ను ఎంచుకున్నారు ఆమె.. అయితే ఆమె ఢిల్లీ, హైదరాబాద్ తదిత ర  మహానగరాల్లో పెద్దపెద్ద కోచింగ్ సెంటర్లకు వెళ్లి సివిల్స్ కు సన్నద్ధమయ్యారు అంటే పొరపాటే.. గర్భవతిగా ఉండగానే కష్టపడి చదివి తాను కలలు కన్న ఐఎస్ సర్వీస్ ను అందుకున్నారు.. ఈ ఐఏఎస్ దంపతుల స్వస్థలం తమిళనాడు అయినప్పటికీ కన్నడ లో బాగా మాట్లాడడం విశేషం.. వివిధ ప్రాంతాల్లో పనిచేయబట్టే ఆ భాషలు వచ్చాయని చెప్తున్నారు వీరు..

ఆమెకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ చదవాలనే తపన ఉండేదట.. అందుకే అగ్రికల్చర్ బీఎస్సీ అయిన తర్వాత సివిల్స్ పరీక్షలు రాసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు ఎంపికై అందు లో కొంత కాలం పని చేశారట.. అయితే ఎలాగైనా ఐఏఎస్ కావాలని అనుకొని పెళ్లయిన తర్వాత తన భర్త రామ్ ప్రసాత్ మనోహర్ ప్రోత్సాహంతో ఐఏఎస్ పరీక్షలు రాసి ఐఏఎస్ అయ్యింది దివ్య ప్రభ.. డెహ్రడూన్ లో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసిన తర్వాత కార్వరలో ప్రొబేషన్ పూర్తి చేశారట దివ్య ప్రభ.. అనంతరం రాయచూరు జిల్లా లింగసూర్ ఊరులో అసిస్టెంట్ కమిషనర్ పనిచేసిన తర్వాత బళ్లారిలో ప్రప్రధమంగా నగర కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు.. ఇది  తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: