సాధారణంగా పుట్టిన పసి పిల్లలకు ఆరునెలల వరకూ కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే బిడ్డ పుట్టిన ఆరునెలల వరకూ బిడ్డకి కావాల్సిన ప్రతీదీ సరైన మోతాదులో తల్లిపాల నుండి లభిస్తుందని తెలిపారు. ఇక బిడ్డ పుట్టిన దగ్గర నుండీ బిడ్డకి ఆరునెలలు వచ్చే వరకూ బిడ్డ అవసరాలకి తగినట్లుగా తల్లిపాలలో పోషకాలు కూడా మారుతూ ఉంటాయని తెలిపారు. అంతేకాదు.. బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి మొదటిసారిగా వచ్చే పాలని కొలోస్ట్రమ్ అంటుంటారు. ఇక ఇది బిడ్డకి చాలా మంచిది.

ఇక ఇందులో ప్రొటీన్ ఎక్కువగా, షుగర్ తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బిడ్డకి కావాల్సిన ప్రతీదీ ఈ కొలోస్ట్రమ్‌లో ఉంది. అంతేకాదు.. ఈ కొలోస్ట్రమ్‌ని ఎలాంటి ఫార్ములా కూడా రీప్లేస్ చేయలేదని తెలిపారు. కాగా..ఈ కొలోస్ట్రమ్ బిడ్డ డైజెస్టివ్ ట్రాక్ట్ డెవలప్ అవ్వడానికి సహాయ పడుతుంది. పిల్లలు పుట్టిన మొదటి నెలల్లో బిడ్డకి వైరస్‌లతో, బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని తల్లి పాలలో ఉండే యాంటీ బాడీస్ ప్రొవైడ్ చేస్తుంటాయని తెలిపారు. అయితే కొలోస్ట్రమ్‌లో ఈ యాంటీ బాడీస్ బాగా ఉంటాయన్నారు.

అంతేకాక.. కొలోస్ట్రమ్ లో ఇమ్యునోగ్లాబ్యులిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది. ఇక ఇది బేబీ ముక్కు, గొంతు, డైజెస్టివ్ సిస్టమ్ మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్‌ని ఏర్పరుస్తుందన్నారు. అయితే ఈ లేయర్ బిడ్డని జబ్బు పడకుండా కాపాడుతుందని సూచించారు. అలాగే మొదటి ఆరు నెలలు కేవలం తల్లి పాలు మాత్రమే బిడ్డ తాగినట్లైతే బిడ్డకి రకరకాల చిన్న పెద్ద వ్యాధుల నుండి ఎక్కువ ప్రొటెక్షన్ లభిస్తుందని తెలిపారు. పిల్లలో చెవి, గొంతు, సైనస్ ఇంఫెక్షన్స్ నుండి బిడ్డ కొంచెం పెద్దయ్యే వరకూ రక్షణ కలిగిస్తుంది. ఇలాంటి  సమయంలో జలుబు వచ్చే ఛాన్స్ దాదాపు లేనట్లే. ఇంకా వివిధ రకాల ఎలర్జీల నుండి డయాబెటీస్ వరకూ తల్లి పాలు బిడ్డని ప్రొటెక్ట్ చేస్తుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: