కియా నుంచి ఈ ఏడాదికి సంబందించిన కారు వచ్చేసింది..2018 ఆగస్టులో దీన్ని భారత విపణిలో లాంచ్ చేశారు. ఆనతి కాలంలో
భారత్ లో అత్యధిక విక్రయాలు అందుకున్న వాహనంగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా 2021 వర్షన్ లోనూ బ్రాండ్ న్యూ లోగోతో పాటు మరికొన్ని అప్డేట్లు చేశారు. గతంలో కంటే స్టైలిష్ గా, మోడర్న్ కియా లోగో బోనెట్ పై సందడి చేస్తున్నాయి. ఇకపోతే ఈ కారు డిజైన్ విషయానికొస్తే...ఎక్స్ షోరూంలో కియా సెల్టోస్ ప్రారంభ ధర వచ్చేసి రూ.9.95 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. దీని టాప్ స్పెక్ ధర వచ్చేసి రూ.17.65 లక్షలుగా నిర్ణయించింది.
ఈ సరికొత్త 2021 కియా సెల్టోస్ అచ్చం పాత మోడల్ మాదిరిగానే ఉంది. దీని డిజైన్, ఇంజిన్ విషయంలో పెద్దమార్పులేమి చేయలేదు. అయితే రెండు వేరియంట్లలో 17 కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేసింది.. కొత్తగా లాంఛ్ అవుతున్నా కారు లో ఎటువంటి మార్పు లేదు..ముందు వైపు సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, టైగర్ నోస్ గ్రిల్ తో కూడిన మస్కులర్ బంపర్ ను కలిగి ఉంది. టాప్ వేరియంట్లో అయితే డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉంచారు.
హెచ్టీకే వేరియంట్లో వైర్లెస్
ఫోన్ ప్రొజెక్షన్ తో కూడిన 8-అంగుళాల టచ్ స్క్రీన్, హెచ్టీకే ప్లస్ వేరియంట్లో రిమోట్ ఇంజిన్ స్టార్ట్, స్మార్ట్ కీ ఆప్షన్ ను అప్డేట్ చేశారు. ఇవి కాకుండా బీజో ఫాబ్రిక్ సీట్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ తదితర ఆప్షన్లు ఇందులో ఉన్నాయి..టాప్ స్పెక్ ఇంజిన్ 1.4-లీటర్ జీడీఐ టర్బో
పెట్రోల్ మోటార్, 138 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 242 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ కారులో మూడు ట్రాక్షన్ సెట్టింగులు ఉన్నాయి.. మొత్తానికి ఈ కారు అడ్వాన్స్
టెక్నాలజీ కారు మరి కొద్దీ రోజుల్లో
మార్కెట్ లోకి రానుందని తెలుస్తుంది..