టాటా మోటార్స్‌కి చెందిన బ్రిటీష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మంచి లగ్జరీ కార్ ల కంపెనీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చెందింది.ఇక జాగ్వార్ ల్యాండ్ రోవర్ తమ సరికొత్త  రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ ఎస్‌యూవీని ఇండియా మార్కెట్లో విడుదల చేసింది.ఇక ఇండియా మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.2.19 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.ఇక ఈ కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ పెర్ఫార్మెన్స్ వెర్షన్ ఎస్‌యూవీలో కంపెనీ చాలా అప్‌గ్రేడ్స్ చేసింది. ల్యాండ్ రోవర్ బ్రాండ్‌కి చెందిన పెర్ఫార్మెన్స్ వాహన విభాగం (ఎస్‌విఆర్)స్పెషల్ గా ఈ కారుని డిజైన్ చేసింది. ఇక ఇందులో శక్తివంతమైన సూపర్ఛార్జ్డ్ ఇంజన్‌ను వాడారు.ఈ కార్ ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన ల్యాండ్ రోవర్ కారట.

ఇక ఇండియాలో ఇది ఒకే వేరియంట్‌లో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది.ఇక ఈ కారును యూకేలో తయారు చేసి, అక్కడి నుండి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో ఇండియాకి దిగుమతి చేసుకోవటం జరుగుతుంది. అందుకే, ఈ కారు ధర కూడా అంత ఎక్కువగా ఉంటుంది.ఇక ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కారులో పవర్‌ఫుల్ 5.0-లీటర్ సూపర్ఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించడం జరిగింది. ఈ ఇంజన్ ఎక్కువగా 567 బిహెచ్‌పి శక్తి ఇంకా 700 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ ఇంజన్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో మిక్స్ చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ రేంజ్ రోవర్ స్పోర్ట్ తేలికపాటి అల్యూమినియం ఆర్కిటెక్చర్‌తో తయారు చేయబడింది.ఇక దీని కారణంగా ఈ ఎస్‌యూవీ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల స్పీడ్ చేరుకోగలదు. ఇక దీని టాప్ స్పీడ్ గంటకు 283 కిలోమీటర్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

ల్యాండ్ రోవర్ విప్లవాత్మక టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్‌తో ఇంజన్ ద్వారా రిలీజ్ అయ్యే పవర్ నాలుగు చక్రాలకు సమానంగా సప్లై చేయబడుతుంది. ఇంకా పంపబడుతుంది. రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ ఎస్‌యూవీ ఆల్-టెర్రైన్ పవర్ తో ఎక్కడ రాజీ పడకుండా చాస్సిస్ మరింత డైనమిక్ హ్యాండ్లింగ్ కోసం బెస్పోక్ మెరుగుదలలతో అమర్చబడిందని ల్యాండ్ రోవర్ కంపెనీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: