ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలకు రాను రాను గిరాకీ చాలా విపరీతంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఈ విభాగంలో లభించిన మోడళ్లను కేవలం మన చేతి వేళ్ల మీద లెక్కపెట్టేయవచ్చు. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య పదులను దాటిపోవడం జరిగింది. ఇక అంతేకాదు ఇప్పుడు ఈ ఎస్‌యూవీ విభాగాన్ని ఫుల్-సైజ్, మిడ్-సైజ్ ఇంకా కాంపాక్ట్ అలాగే మైక్రో ఎస్‌యూవీలు అంటూ మరిన్ని కొత్త విభాలుగా విభజించడం జరిగింది.ఇక ఇప్పటి వరకు మిడ్-సైజ్ ఇంకా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగాల్లోనే పోటీ అనేది బాగా విపరీతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ మైక్రో ఎస్‌యూవీ విభాగంలో పోటీ చాలా తీవ్రతరం అవుతోంది. ఇక ఈ విభాగంలో ఇప్పటికే మారుతి సుజుకి బ్రాండ్ ఇగ్నిస్ అనే మోడల్ ను అమ్ముతుండగా మహీంద్రా కంపెనీ వచ్చేసి కెయూవీ100 అనే మోడల్ ను అమ్ముతుంది.


ఇక ఇదిలా ఉంటే,ఇండియా ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఇప్పుడు ఈ విభాగంలో కొత్తగా పంచ్ అనే మైక్రో ఎస్‌యూవీని విడుదల చేయబోతున్నామని ప్రకటించడం జరిగింది.ఇక అందుకు సంబంధించిన ఓ టీజర్ ఇమేజ్ ని కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఇక ఈ కార్లకు పోటీ ఇచ్చేందుకు కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ కూడా సిద్ధమైంది.ఇక ఈ కొరియన్ కార్ కంపెనీ ఇప్పుడు హ్యుందాయ్ కాస్పర్  పేరుతో ఓ మైక్రో ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఇక ఈ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలోనే చాలా చిన్న ఎస్‌యూవీ కావటం విశేషంగా చెప్పుకోవచ్చు.హ్యుందాయ్ కంపెనీ ఈ కొత్త కాస్పర్ మైక్రో ఎస్‌యూవీ కార్ ని, ప్రస్తుతం అమ్ముతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ వెన్యూ కి దిగువన ప్రవేశపెట్టబోతుంది.ఇక హ్యుందాయ్ కాస్పర్ విషయానికి వస్తే...కంపెనీ ఈ మైక్రో ఎస్‌యూవీ కార్ లో పెద్ద రేడియేటర్ గ్రిల్ ఇంకా ఫ్రంట్ బంపర్ లో అమర్చిన గుండ్రటి హెడ్‌లైట్స్ అలాగే ఫ్రంట్ బంపర్‌లో బ్లాక్ అండ్ గ్రే గార్నిష్ ఇంకా హుడ్ క్రింద అమర్చిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లు ఈ సూపర్ మినీ కారులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: