IHG
దాదాపుగా ఏడు దశాబ్దాల తరువాత ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కైవసం చేసుకుంది. భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియా ను నష్టాల్లో నడపడం, ఇంకా అధిక రుణభారం అవుతూ ఉండటం తో ఎయిర్ ఇండియాను భారత ప్రభుత్వం 100 శాతం వాటాల ఉపసంహరణకు 2020 లో ఓపెన్ బీడ్ లను పిలిచింది. ఈ ఓపెన్ బీడ్ లో టాటా సన్స్ సంస్థ , స్పైస్ జెట్ మొదలగు కంపెనీలు పోటీ పడ్డాయి. ఊహించని విధంగా టాటా సన్స్ సంస్థ ఎయిర్ ఇండియాను 18 ,000 ఓపెన్ బిడ్ లో కైవసం చేసుకుంది. స్పైస్ జెట్ చివరివరకు పోటీలో నిలిచినప్పటికీ 15 ,100 కోట్లతో బిడ్ ను దక్కించుకో లేక పోయింది. బిడ్ గెలవడం తో టాటా సన్స్ సంస్థ తిరిగి తన మానస పుత్రిక ఎయిర్ లైన్స్ ను తిరిగి దక్కించుకున్నట్లైంది.

ఎయిర్ ఇండియా చరిత్ర :
IHG 1932  సంవత్సరం లో టాటా  సన్స్  అధినేత జ‌హంగీర్ ర‌త‌న్ జీ దాదాబాయ్ టాటా  ఎయిర్ ఇండియా ను ఎయిర్ వేస్ పేరు తో ప్రారంభించారు . ఎయిర్ వేస్ తొలి క్రాఫ్ట్ ను జంషెడ్ జీ టాటా నడిపి ప్రారంభించారు.  తరువాత 1938  లో ఎయిర్ వేస్ సేవలను విదేశాలకు విస్తరిస్తూ ఎయిర్ లైన్స్ గా పేరు మార్పు చేసారు . రెండవ  ప్రపంచ యుద్ధం తరువాత ఎయిర్ లైన్స్ భారీ నష్టాల్లో కూరుకుపోవడం  మరియు భారత ప్రభుత్వం జాతీయికరణ పేరుతో ఎయిర్ లైన్స్ ను ప్రభుత్వ పరం చేసుకుంది. భారత ప్రభుత్వం 1977  వరకు కూడా ఎయిర్ లైన్స్ సంస్థ నిర్వాహణ భాద్యతలను టాటా లకు అప్పగించింది. 1977  తరువాత  ఎయిర్ లైన్స్ ను ఎయిర్ ఇండియాగా నామ కారణం  చేసి దాదాపు 68  సంవత్సరాలు ఎయిర్ ఇండియా ను ప్రభుత్వం నడిపింది. ఎయిర్ ఇండియా సంస్థకు 127  ఎయిర్ క్రాఫ్ట్ లు ఉన్నాయ్. ఎయిర్ ఇండియా ప్రస్తుతం 42 దేశాలకు సేవలందిస్తోంది.
IHGప్రస్తుతం ఎయిర్ ఇండియా నష్టాల్లో నడవడం, అప్పుల భారం పడుతూ ఉండడం తో 100 శాతం వాటాలను ప్రయివేట్ సంస్థ లకు విక్రయించాలని అనుకుంది. 2020 లో ఓపెన్ బిడ్ లో టాటా సన్స్ సంస్థ బిడ్ వేయగా 18000 కోట్ల  తో బిడ్ ను కైవసం చేసుకుంది.  2021 డిసెంబర్ నాటికీ ఎయిర్ ఇండియా  నిర్వహణ హక్కులను ప్రభుత్వం పూర్తిగా  టాటా గ్రూప్ సంస్థకు అప్పగించనుంది.
IHGఅయితే 68 సంవత్సరాల తరువాత ఎయిర్ ఇండియాను కైవసం చేసుకోవడం యావత్ భారత ప్రజానీకం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: