ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడిన వేల అనేక ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక చాలా రోజులు గానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతూ ఉంటే ప్రధాన ప్రతిపక్షం పార్టీ అయినటువంటి తెలుగుదేశం మరియు జనసేన, బీజేపీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి. ఇక ఈ పొత్తులో భాగంగా మచిలీపట్నం లోక్సభ ఎంపీ సీటు వల్లభనేని బాలశౌరి కి సీటు దక్కింది.

ఇకపోతే ఈయన ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎంపీ కావడంతో ఈయనకు జనాల్లో మంచి ఆదరణ వస్తుంది. చాలా రోజుల నుండి ఈయన ప్రచారాలు కూడా చేస్తూ ఉండడంతో ఈయనకు జనాల్లో అద్భుతమైన క్రేజ్ ఏర్పడింది. దీనితో వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి బాయం పట్టుకున్నట్టు ఉంది. వల్లభనేని బాలశౌరి నీ నేరుగా ఢీకొట్టలేక వింత వింత ప్రయత్నాలతో అతనికి వచ్చే ఓట్లను తగ్గించడానికి తీవ్ర ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలశౌరి జనాల్లో మంచి క్రేజ్ ఉండడంతో ఆయన లాంటి పేర్లు ఉన్న మరో ఇద్దరిని వెతికి తీసుకువచ్చి నామినేషన్లను కూడా వేయించారు.

సిహెచ్ బాలశౌరి , బాల సౌరమ్మ అనే ఇద్దరు పేర్లు వార్తలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇకపోతే తాజాగా శుక్రవారం లోక్ సభకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన స్రుట్ని నీ కార్యక్రమం మచిలీపట్నం లోని కలెక్టరేట్ ప్రాణమంగళం లో జరిగింది. ఇక వల్లభనేని బాలశౌరి జనసేన తరఫున గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేస్తున్నారు. ఈయనకు గాజు గ్లాసు కేటాయించడంతో వాళ్లు కూడా దానికి దగ్గర ఉన్న గుర్తు కోసం చాలా ప్రయత్నాలు కూడా వార్తలు వస్తున్నాయి. వల్లభనేని బాలసౌరిని నేరుగా ఢీ కట్టలేక నాని అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నట్లు కథనాలు బలంగా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: