నాటి నుంచి నేటి వరకు ప్రతి ఒక్క అమ్మాయి జుట్టు పొడవుగా, ఒత్తుగా పట్టులాగా కనిపించాలని కోరుకుంటుంది.  అప్పట్లో అయితే అందుకు తగ్గట్టుగా ఎన్నో రకాల ఆయుర్వేద చిట్కాలు పాటించి, వారి జుట్టును అందంగా, సొగసుగా మార్చుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో అలా కాదు. అందుకు పూర్తిగా విభిన్నం. పొడవైన ఒత్తైన జుట్టు కావాలంటే మాత్రం డాక్టర్ల చుట్టూ తిరుగుతూ,మార్కెట్లో దొరికే ఎన్నో రకాల కాస్మెటిక్స్,ఆయిల్స్,షాంపూలను  వాడుతున్నారు. అయినా ఏమాత్రం ఫలితం రాక, నిరాశ చెందుతున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించి, మీ జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చు. ఆ చిట్కాలేంటో? ఇప్పుడు ఇక్కడ  తెలుసుకుందాం.


యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన టీట్రీ ఆయిల్ కుదుళ్ళలో ఏర్పడిన అలర్జీని తొలగించడంలో సహకరిస్తుంది. ఈ లక్షణాలు  ఎక్కువగా ఉండే ఈ నూనెను నేరుగా కాకుండా, ఆలివ్ నూనె తో కలుపుకొని వాడాల్సి ఉంటుంది. కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ను ఆలివ్ ఆయిల్ తో  కలిపి జుట్టు కుదుళ్లకు, జుట్టుకు పట్టిస్తే కుదుళ్ల ఆరోగ్యం రెట్టింపవడమే  కాకుండా, జుట్టుకు తగినంత తేమ అంది, జుట్టు పట్టులా మెరుస్తుంది.

జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే అద్భుత గుణాలు కలిగిన లావెండర్,జోజోబా ఆయిల్ ను తప్పకుండా ఉపయోగించి చూడండి. వీటిని కలిపి వాడితే కుదుళ్ళలో కొత్త కణాలు ఉత్పత్తి అయి,తద్వారా వెంట్రుకలు బలంగా పెరిగేందుకు దోహదం చేస్తాయి. అలాగే ఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కుదుళ్లను శుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తాయి. అయితే ఈ క్రమంలో క్యారియర్ ఆయిల్ అయినా జోజోబా ఆయిల్ లో కొన్ని చుక్కలు లావెండర్ నూనెను కలిపి, జుట్టు కుదుళ్లకు, జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. ఫలితంగా జుట్టు రాలే  సమస్య నుంచి బయటపడవచ్చు.

ఇక అంతేకాకుండా చలికాలం వచ్చిందంటే చాలు చుండ్రు  వేధింపులు ఎక్కువ అవుతాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే లెమన్ గ్రాస్ ఆయిల్ తో పాటు ఆర్గాన్ ఆయిల్ చక్కగా పనిచేస్తాయి అంటున్నారు నిపుణులు. వీటిని కలిపి జుట్టుకు, కుదుళ్లకు పట్టించి, కాసేపు మృదువుగా మర్దనా చేయాలి. ఇలా వారం,పది రోజులు తరచూ చేయడం వల్ల సత్వర పరిష్కారం కలుగుతుంది. అలాగే చుండ్రు రావడానికి కుదుళ్ళు తేమను కోల్పోవడం  కూడా ఒక కారణం. కాబట్టి ఇందుకు ఆర్గాన్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: