
ముఖ్యంగా మనం పాటించాల్సిన చిట్కాల విషయానికి వస్తే పాల మీగడ తో పాటు పసుపు కలిపి ఉపయోగించడం.. పాల మీగడ చాలా జిగటగా ఉంటుంది కాబట్టి బాహ్య చర్మ మీద అప్లై చేసినప్పుడు చర్మం మీద ఉండే మృతకణాలను తో పాటు దుమ్ము, ధూళి వంటి మలినాలు కూడా త్వరగా తొలగిపోతాయి..ఇక పసుపు అప్లై చేయడం వల్ల ఇది చర్మానికి యాంటీబయాటిక్ గా పనిచేసి.. చర్మం మీద వచ్చే అలర్జీ , దద్దుర్లు , చిన్న చిన్న మొటిమలు వంటి వాటిని దూరం చేస్తుంది. ముందుగా ఈ పాల మీగడలో పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి..
ఒక పదిహేను నిమిషాల తర్వాత పూర్తిగా ఈ ప్యాక్ ను తొలగించి ఆ తర్వాత చక్కటి సున్నిపిండిని కొద్దిగా నీటిలో కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పాల మీగడ వల్ల పేరుకుపోయిన జిడ్డు కూడా పూర్తిగా తొలగిపోతుంది..ఇక సున్నిపిండి లో పూర్తి ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి చక్కగా పనికొస్తుంది. ఇక వారానికి రెండు సార్లు ఈ చిట్కాలను పాటించినట్లైతే మీ చర్మం అందంగా కనిపించడం తో పాటు చూడడానికి కూడా చాలా కాంతి వంతంగా కనిపిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా పెళ్ళి కూతుళ్ళు.. పెళ్లి సమయానికి నెల రోజుల ముందు నుంచి ఈ చిట్కాలు పాటించడం వల్ల బ్యూటీ పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు.