దుబ్బాక లో గెలిచిన ఉత్సాహం ఇప్పుడు బీజేపీ లోస్పష్టంగా కనిపిస్తుంది. టీ ఆర్ ఎస్ పార్టీ పై ఉన్న వ్యతిరేకత ను పూర్తి గా వినియోగించుకుని దుబ్బాక లో స్వల్ప తేడాతో విజయ భేరి మోగించింది. అయితే అదే ఉత్సాహాన్ని గ్రేటర్ లోనూ కనపరుస్తూ ఇక్కడ కూడా గెలు గుర్రం ఎక్కే ప్రయత్నాలు చేస్తుంది.. హైదరాబాద్ లో పలు పరిస్థితుల వల్ల టీ ఆర్ ఎస్ పై వ్యతిరేకత ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది.. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ కి బలం కాదు కదా అండగా నిలిచే వారు కూడా ఎవరు లేరు.. అలాంటిది సడ్డెన్ గా పార్టీ బలపడడం దగ్గరినుంచి గెలిచేవరకు పుంజుకుంది అంటే ఖచ్చితంగా అది బీజేపీ నేతల కష్టం అని చెప్పాలి..