గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మార్క్ చాలానే కనిపిస్తుంది. దుబ్బాక ఫలితం తమకు ఫేవర్ కు రావడంతో ఒక్కసారి గా తెలంగాణ లోబలమైన పార్టీ గా ఎదిగిన బీజేపీ పార్టీ ఇప్పుడు గ్రేటర్ లోనూ విజయ ఢంకా మోగించి మరింత బలపడాలని చూస్తుంది. అందుకోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది బీజేపీ. ఇప్పటికే తెలంగాణ లో కాంగ్రెస్ ను పక్కకు తోసి రెండో స్థానానికి ఎగబాకిన బీజేపీ పార్టీ ఇప్పుడు టీ ఆర్ ఎస్ ప్లేస్ కి ఎర్త్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టీ ఆర్ ఎస్ ని గద్దె దింపి ఆ ప్లేస్ లో తమ పార్టీ ని నిలపాలన్నదే బీజేపీ ఆలోచన కాగా ఇప్పుడు గ్రేటర్ లోనూ అదే ఆశతో ముందుకు వెళుతుంది..