త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి మహేష్ ఆమధ్య గట్టిగానే ప్రయత్నించాడు. ఖలేజా రిలీజ్ అయి పది సంవత్సరాలయిన సందర్భంగా మళ్లీ తమ కాంబినేషన్లో సినిమా అతి త్వరలో వస్తోందంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ మలి చిత్రం చేయడానికి కమిట్ అయిన త్రివిక్రమ్ వెంటనే మహేష్ సినిమా స్టార్ట్ చేయలేకపోయాడు. ఈలోగా సర్కారు వారి పాట షూటింగ్ మొదలు పెడుతున్నామంటూ ఆ చిత్ర నిర్మాతలు హడావిడి చేసారు. దీంతో మహేష్, త్రివిక్రమ్ సినిమా పక్కకెళ్లిపోయింది. ఇప్పటికీ తారక్ జనవరికి అయినా రాకపోతే త్రివిక్రమ్ వేరే సినిమా ఏదయినా చేసేస్తాడనే వార్తలొస్తున్నాయి. అయితే మహేష్‌తో మాత్రం త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో వుండకపోవచ్చు.