చైతు మనం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. 'థ్యాంక్యూ' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతు మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ మూడు క్యారెక్టర్స్ లో ఒకటి యువ రైతు పాత్ర అని.. మరొకటి ఎన్నారై పాత్ర అని అంటున్నారు. అయితే మూడో పాత్ర ఎంటనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్టు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి రష్మిక మందన్నా - ప్రియాంక అరుల్ మోహన్ లను ఎంపిక చేశారని టాక్.