మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన.. వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉన్నాయి.. సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు.. అందుకే ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు..