నిన్నటిదాకా తెలంగాణ లో ఎన్నికల వాడి వేడి మాములుగా లేదు.. ముఖ్యంగా బీజేపీ పార్టీ అయితే ఓ రేంజ్ లో దూసుకెళ్లింది చెప్పొచ్చు. దుబ్బాక ఎన్నికల్లో విజయం, గ్రేటర్ లో మంచి ప్రభావం చూపించడంతో వారిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది.. దాంతో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అన్నట్లు బీజేపీ నేతలు ఎంతో హుషారు కనపరిచారు. నిజానికి తెలంగాణ లో టీ ఆర్ ఎస్ పార్టీ పరిస్థితి మునుపటికంటే కొంత భిన్నంగా ఉన్న సంగతి ఆయా నేతలు సైతం ఒప్పుకుంటున్నారు.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ను వారు స్పష్టంగా ఫీల్ అవుతున్నారు..