దేశంలో కరోనాని అరికట్టే నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు ఈ నెల 14 తర్వాత కూడా లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.  అయితే కరోనా వ్యాప్తిని అరికట్టే విషయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు అంటున్నారు.  అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం లాక్ డౌన్ సడలింపు చేయాలని.. కొన్ని డేంజర్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగేలా చూస్తామని అన్నారు.  రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నూతన విధానం తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే.

 

ఇంతకు ముందు రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది. ఇప్పుడు రేషన్‌ కార్డును మూడు విభాగాలుగా మార్చి బియ్యం కార్డు, విద్య, వసతి దీవెన, ఆరోగ్యశ్రీగా విభజించారు. కొత్తకార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి కరోనా, లాక్‌డౌన్‌ వచ్చిపడడంతో చాలామందికి కార్డులు అందలేదు.  ఎవరివద్దయినా ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే చింత అవసరం లేదని, సరైన ఆధారాలతో వస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆయా ఆసుపత్రుల్లో వైద్యం పొందవచ్చునని నెల్లూరు జిల్లా ఆరోగ్యశ్రీ పథకం సమన్వయకర్త డాక్టర్‌ నాగార్జున ప్రకటించారు.

 

కాగా,   ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇకపై జిల్లా కేంద్రంలోనే అనుమతి తీసుకోవచ్చని చెప్పారు డాక్టర్‌ నాగార్జున. రోగానికి సంబంధించిన ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డు పాస్‌పోర్టు ఫొటోతో వస్తే ఉచిత వైద్యానికి అనుమతిస్తామని తెలిపారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: