సాధారణంగా కుక్కలు  పరిగెత్తినప్పుడు, జంపు చేసినప్పుడు వాటి శరీరం సాగినట్టు అనిపిస్తుంది. అవి చేసే వింత వింత విన్యాసాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   ఇక ఆకలి అయినపుడు కుక్కలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.  వాటిిికి దగ్గరైన వారు ఏవైనా బిస్కెట్లు కానీ.. మరే ఆహారం పెట్టిన తోకలు ఊపుకుంటూ వస్తుంటాయి.  అలా తోకలు ఊపడం అంటే  అవి మనుషులను ఆత్మీయులుగా గుర్తు పట్టినట్టు లెక్క.  కడుపు నింపుకునే క్రమంలో అవి వేట కోసం ఉరుకులు, పరుగులు, దూకడాలు చేస్తుండటం తెలిసిందే.

 

కొన్ని కుక్కలు ఎంత ఎత్తు గోడైనా సరే.. ఇట్టే దూకేస్తాయి. తాజాగా కుక్క  గాల్లోకి ఎగిరేందుకు వాడే టెక్నిక్ ఎలాంటిదంటే.. తోకను గిరగిరా తిప్పడం చాలా విచిత్రంగా ఉంది.  ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో పంచుకున్నారు.  కుక్కు చాలా అవలీలగా కంచె దూకేసింది.

 

ఐదు లైన్లు ఉన్న కంచె సందుల్లోంచి అది వెళ్లకుండా ఏకంగా పైనుంచే దూకేసింది. అది దూకే సమయంలో తన తోక గిర గిరా చుట్టూ తిప్పడం చాలా ఫన్నీగా ఉంది అని ట్వీట్ చేశారు. అందరూ హెలికాప్టర్ డాగ్ అని ముద్దుగా పిలుస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఈ వీడియోను 14వేల మంది వీక్షించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: