ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే తాజాగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ సమయంలో సామాన్య ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది అంటూ చెప్పారు. లాక్ డౌన్ సమయంలో సామాన్యులు నిరుపేదలకు ఎక్కడ కష్టం లేకుండా చూస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించి ఇంటికే పరిమితం కావాలని... కరోనా వైరస్ పై పోరాటంలో ప్రభుత్వానికి ప్రజలు అందరూ సహకరించాలని సూచించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి