డ్యాన్స్ అనగానే టాలీవుడ్‌లో గుర్త‌కు వ‌చ్చే హీరో చిరంజీవి. డ్యాన్స్ అంటే చిరు.. చిరు అంటే డ్యాన్స్‌..! అంత‌లా మెస్మ‌రైజ్ చేశాడు! డ్యాన్సే చిరును మెగాస్టార్‌గా తీర్చిదిద్దింది..! ఈరోజు ఇంట‌ర్నేష‌న‌ల్ డ్యాన్స్ డే.. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్‌తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ వీడియో ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. డ్యాన్స్ తో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని, అదే తనకు కోట్లాది మంది అభిమానులు తెచ్చిపెట్టిందని మెగాస్టార్ అన్నారు. ప‌నుల‌తో మానసికంగా ఒత్తిడికి గురైన సందర్భంలో మంచి మ్యూజిక్ పెట్టుకుని వింటూ డాన్స్ చేస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉండేదని, ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉంటున్న మీరు కూడా ఎప్పుడైనా ఒత్తిడికి గురుయితే ఇలాగే చేయండంటూ ప్రజలకు సూచిస్తూ అందరికీ డ్యాన్స్ దినోత్స‌వ‌ శుభాకాంక్షలు తెలిపారు.

 

ఇక అలాగే.. డ్యాన్స్ డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన డాన్స్ క్లిప్పింగ్స్ తో కూడిన వీడియో ని సాయంత్రం 6 గంటలకు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తాన‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇక అభిమానులంద‌రూ ఆ స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: