అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఆ ఒక్కటి అడక్కు సినిమా మే 3 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను , పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డ్ నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ బృందం వారు మే 1 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదు లో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వైవిధ్యమైన పాత్రల్లో , సీరియస్ పాత్రలోనే నటిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా ఈయన నటించిన నాంది మూవీ సూపర్ సక్సెస్ అయింది. నరేష్ ఆ తర్వాత  ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం , ఉగ్రం అనే రెండు సీరియస్ పాత్రల్లో నటించినప్పటికీ ఈయనకు ఈ సినిమాలు ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చాయి. మరి చాలా సంవత్సరాల తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి ఆ ఒక్కటి అడక్కు సినిమా ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: