ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ క్లియర్‌ ట్రిప్‌ను ఫ్లిప్‌కార్ట్‌ సొంతం చేసుకోనుంది. క్లియర్‌ ట్రిప్‌నకు సంబంధించిన 100శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్లు  ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, వినియోగదారులకు చేరువ చేసేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. కొనుగోలు తర్వాత కూడా క్లియర్‌ ట్రిప్‌ ప్రత్యేక బ్రాండ్‌గానే కొనసాగనుంది. ఈ డీల్‌ విలువ 40 మిలియన్‌ డాలర్లు ఉండవచ్చని వాణిజ్య పత్రికలు అంచనా వేస్తున్నాయి.  ‘డిజిటల్‌ వేదికగా వినియోగదారులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ కట్టుబడి ఉంది. పర్యటనలకు క్లియర్‌ ట్రిప్‌ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆ బ్రాండ్‌ను కొనసాగిస్తూనే, కొత్త ప్రాంతాల్లో సంస్థను వృద్ధి చేస్తాం. పెట్టుబడులు పెట్ట‌డంవ‌ల్ల మ‌రింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుంద‌ని భావిస్తున్నామ‌ని  ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. పర్యాటక రంగం, టెక్నాలజీ విషయాల్లో క్లియర్‌ట్రిప్‌నకు ఉన్న అనుభవం ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌నకు ఉపయోగపడుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: