తెలంగాణ రాజకీయాల్లో యాక్టీవ్ కావాలని, వచ్చే ఎన్ని ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఈ మద్య కాలంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆమె ఎక్కువ కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఆమె కరోనా వ్యాక్సిన్ గురించి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి కేసీఆర్ సారూ. మీకు చేతకాకనా? అని ఆమె ప్రశ్నించారు. 


మీకు ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? లేక కమీషన్లకు ఆశపడా? అని ప్రశ్నించారు. లేదా వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? మీరు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..? తలాపున సముద్రమున్నా చాప దూప కేడ్చినట్టుగా వ్యాక్సిన్ల తయారీ సంస్థలు ఇక్కడే ఉన్నా మీకు మాత్రం దొరకడం లేదా? అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో ఫస్ట్ డోస్ ఆపి నెలరోజులైందన్న ఆమె ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్నాయి, ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందించండని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: