ఎన్నికలు వచ్చాయంటే ఒక పార్టీలో ఉన్న అసంతృప్త నేతలు మరొక పార్టీ లోకి వెళ్లడం కామన్ అయిపోయింది. సొంత పార్టీలో టికెట్ రాకున్నా... ప్ర‌త్య‌ర్థి వచ్చి పక్కన‌ కూర్చున్నా నేతలు జంపు జిలాని అంటున్నారు. ఇప్పుడు బీజేపీ నేత పెద్దిరెడ్డి కూడా అదే ఫాలో అవుతున్నట్టు క‌నిపిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఇనుగాల పెద్దిరెడ్డి గతంలో బిజెపి తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఇప్పుడు కారు దిగి కమలం పార్టీలో చేరిన ఈటల రాజేందర్ కు హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. 

ఈ నేపథ్యంలోనే ఆయన టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. మరోవైపు పెద్దిరెడ్డి సహచరుడు ఎల్.రమణ ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు పెద్దిరెడ్డి కి గతంలో కేసీఆర్ తో అన్న పరిచయం కూడా ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరేందుకు ఒక కారణమని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి టిఆర్ఎస్ లోకి చేరేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈనెల 30న సీఎం కేసీఆర్ సమక్షంలో పెద్దిరెడ్డి టిఆర్ఎస్ లోకి చేరబోతున్నారు. హుజురాబాద్ ఎన్నికల వేళ పెద్దిరెడ్డి కారు పార్టీ లోకి చేరడం ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: