గత వారం సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. అతని సోదరి మరియు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆమె ప్రొఫైల్ ఫోటోను మార్చారు. రాహుల్ గాంధీ ఫోటో ని ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ గా పెట్టారు ప్రియాంక.

ట్విట్టర్ పై ప్రియాంకా గాంధీ ఫైర్ అయ్యారు. ట్విట్టర్  తన స్వంత విధానాన్ని అనుసరిస్తోందా లేక మోదీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుందా అని నిలదీసారు. కాంగ్రెస్ నాయకుల ఖాతాలను అడ్డుకోవడానికి మోడీ ప్రభుత్వ ఆదేశాలను ట్విట్టర్ పాటిస్తుందా అని ఆమె నిలదీశారు. గతంలో ఇతర పార్టీల నాయకులు తమ నాయకుల కంటే ముందే ఈ తరహా ఫోటోలను పోస్ట్ చేసారని ప్రియాంక ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: