టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. ఇక దీపావళి సందర్బంగా తాజాగా ఈ సినిమా నుంచి మహేష్ లుక్ తో కొత్త పోస్టర్ తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నట్లు సూపర్ స్టార్ మహేష్ ఇంకా చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 

ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో అయితే ఊర మాస్ లుక్ లో మహేష్ ఆదరగోడుతున్నాడు.పోస్టర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పట్ల సూపర్ స్టార్ సూపర్ అభిమానులకు అంచనాలు తారా స్థాయిలో వున్నాయి.వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పరశురామ్ ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రేంజ్ కి తగ్గట్లు రూపొందిస్తున్నాడట..


https://twitter.com/urstrulyMahesh/status/1455845986366935040?t=Spihe8IzeQie39zUqXvHyA&s=19

మరింత సమాచారం తెలుసుకోండి: