ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పు గోదావ‌రి జిల్లా పీ.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నేత , నగర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కొండ‌ల్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఓ వైసీపీ నేత ఇంట్లో  వివాహానికి చందాలు వ‌సూలు చేశారంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర చ‌ర్చ న‌డుస్తున్న‌ది. వివాహానికి ముందే వాలంటీర్‌, కార్య‌క‌ర్త‌, నేత‌ల‌కు చందాల కోసం టార్గెట్ విధించార‌ని ఆరోప‌ణ‌లు చేసారు. వివాహ రిసెప్ష‌న్ రోజు ఒక్కో మండ‌లానికి ఒక టేబుల్ ఏర్పాటు చేసి చందాలు వసూలు చేశార‌ని ఆరోపించారు.

 పీ.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఇసుక. మ‌ట్టి దోచేవారికి, సెటిల్‌మెంట్లు చేసేవారికి ఆనేత వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని చేసిన వ్యాఖ్య‌లు ఆ నియోజ‌క‌వర్గంలో విస్తృత చ‌ర్చ కొన‌సాగుతున్న‌ది.  ఈ వైసీపీ నేత వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో  తెగ వైర‌ల్‌గా మారాయి. ముఖ్యంగా  గ‌త కొంత కాలం నుంచి పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నేత‌లు రెండు గ్రూపులుగా చీలిపోయాయ‌నే టాక్ ఉన్న‌ది. దీంతో సోష‌ల్ మీడియా వేధిక‌గా రెండు గ్రూపులు విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నాయి. తాజాగా ఈ నేత చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశముగా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: