నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి   రచ్చ కొన‌సాగుతుంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ పోటీలో లేదు. పైగా టీఆర్‌ఎస్‌కి ఫుల్‌ మెజార్టీ. అయితే కల్వకుంట్ల కవిత నామినేషన్ ఏకగ్రీవం అవుతుందని, వార్ ఉండ‌ద‌ని..  వన్‌సైడ్‌ అవుతుందని అనుకున్నారు అంద‌రూ.  కానీ ఇక్కడ కోటగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి నామినేషన్ దాఖ‌లు చేసాడు. కానీ అది ఇద్దరు ప్రజాప్రతినిధుల సంతకాలను ఫోర్జరీ చేసి.. వాళ్లు ప్రతిపాదించినట్లుగా నామినేనన్ దాఖలు చేసిన‌ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 దీనికి సంబంధించి నందిపేట్  నవణీత, నిజామాబాద్ సిటీలోని 31 డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్‌ గజియా సుల్తానా తన ఫోర్జరీ సంతకాలపై ఫిర్యాదు చేయ‌నున్నారు. ఈ నామినేష‌న్ విష‌యంలో ఒక‌వేళ వారిద్ద‌రి సంత‌కాలు ఫోర్జ‌రీ అని తేలితే మాత్రం శ్రీ‌నివాస్ నామినేష‌న్ ప‌త్రాల‌ను తిర‌స్క‌రిస్తారు. కేవ‌లం క‌ల్వ‌కుంట్ల   కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అవుతారు. ఇంత‌కు అస‌లు ఫోర్జరీ జరిగిందా లేదా..? ఇంతా రచ్చ తర్వాత శ్రీనివాస్ అసలు బరిలో ఉంటాడా..?  లేక త‌ప్పుకుంటాడా అనే విష‌యం మ‌రికొద్ది సేప‌ట్లో తేలియ‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: