దేశంలో గత రెండేళ్ల నుండి కరోనా మహమ్మారీ విజృంభణ కొనసాగుతుండటంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇక రెండేళ్ల నుండి పెరుగుతూ వచ్చిన వంటనూనెల ధరలు కాస్త తగ్గి సామాన్య ప్రజలకు ఊరటను కలిగించాయి. అయితే దేశంలో ప్రస్తుతం నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు మళ్లీ డిమాండ్ పెరగనున్నది. ఈ తరుణంలోనే సామాన్య ప్రజలకు మరోసారి షాక్ తగలనుందనే చెప్పాలి మరి.

దేశంలో మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఏంటంటే.. మన దేశానికి ఎక్కువగా వంట నూనెలు ఇండోనేషియా నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అయితే భవిష్యత్‌లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు వంట నూనె దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. దీంతో దేశంలో వంటనూనెలు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇండోనేషియా నుంచి ఫామ్ ఆయిల్ దిగుమతులు తగ్గిపోవడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపనుంది. ఇక వినియోగదారులు వంట నూనెల కోసం డబ్బులు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇండోనేషియా నుండి ఫామాయిల్‌లో 60 శాతం వాటాను భారత్ దేశం దిగుమతి చేసుకుంటుంది. అంతేకాదు.. ఇండోనేషియా నుంచి దిగుమతులు తగ్గినా కూడా ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచుకోవాలని ఇడిబుల్‌ ఆయిల్‌ పరిశ్రమ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాగా.. భారతదేశం ఫామ్ ఆయిల్ అవసరాల్లో 40 శాతం మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాగే మలేషియా నుంచి ఎడిబుల్ ఆయిల్ దిగుమతులను పెంచుకోవాలని అనుకుంటుంది. కానీ తగినంత ఫామాయిల్‌ను మలేషియా నుంచి దిగుమతి చేసుకోవడం కష్టమైన పని అని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే డొమెస్టిక్ బిల్లు ద్వారా ఇండోనేషియా ఫామాయిల్ ఎగుమతుల్ని తగ్గించాలని, దీని ద్వారా అక్కడ ఆయిల్ ధరల్ని తగ్గించాలని ఇండోనేషియా భావిస్తోంది. ఇక ఏది ఏమైనప్పటికి దేశంలో వంటనూనెల ధరలు పెరిగే అవకాశాలు పెరగనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: