ఇటీవల పరీక్షల్లో లీకేజీలు పెద్ద వార్తాంశం అయ్యాయి. అది ఏపీలో ఏకంగా మంత్రుల అరెస్టులకు దారి తీసింది.అయితే.. ఇదో విచిత్రమైన వార్త.. ఇక్కడ ఏకంగా రెండు వర్సిటీలు దాదాపు ఒకే ప్రశ్నాపత్రం ఇచ్చాయి. అది కూడా ప్రతిష్టాత్మకంగా భావించే మెడికల్ విద్యలో.. ఇటీవల ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం  నిర్వహించిన ఎండీ అనస్తీషియా పరీక్ష ప్రశ్నాపత్రం విద్యావర్గాల్లో కలకలం సృష్టించింది. ఎందుకంటే..ఇది ఇటీవల కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ సైన్సెస్‌ పెట్టిన పరీక్ష పత్రం కావడం. యాజ్ ఇట్ ఈజ్‌గా సేమ్‌ పేపర్ ఇవ్వడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఈ అంశంపై ఎన్టీఆర్ వర్శిటీ రిజిస్ర్టార్ డా.శంకర్ స్పందించారు . కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఇదే ప్రశ్నాపత్రం ఇవ్వటం యాధృచ్చికంగా జరిగిందన్నారు.  రెండు యూనిర్శిటీలకు ఒకే వ్యక్తి ప్రశ్నాపత్రం సెట్ చేసి ఉండొచ్చని అన్నారు. ఇక మీదట ప్రశ్నాపత్రం తయారు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. తమ యూనివర్శిటీకి ఇచ్చే ప్రశ్నాపత్రం ఇతర యూనివర్శిటీలకు ఇవ్వొద్దనే నిబంధనలు పెడతామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: