సీఎం జ‌గ‌న్ మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. కడప జిల్లా పర్యటనలో భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓ చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ బాలుడి తండ్రి ఓబులేసు సీఎంని కలిసి తమ కుమారుడి అనారోగ్య సమస్యను వివరించారు. స్పందించిన సీఎం, ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.  అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు అక్కడే ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో వెంటనే  జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు రూ. 1 లక్ష ఆర్ధిక సాయం అందించారు.


కడప జిల్లా భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు కుమారుడు నరసింహ (12 సంవత్సరాలు) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఓబులేశు కడపలో రోజూ కూలీపనికి వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తన కొడుకు ఇబ్బందిని కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం నరసింహ కుటుంబానికి వెంటనే రూ. 1 లక్ష ఆర్ధిక సాయం చేయాలన్నారు. అంతేకాదు..  ఆ బాలుడి వ్యాధికి మెరుగైన చికిత్సకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: