రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్షా శాంతి వనంలో మ్యూజికల్ ఫెస్టివల్ - 2023 అద్భుతంగా  సాగుతోంది. ఆధ్యాత్మిక గురువు లాలాజీ మహారాజ్ 150వ జయంతి వారోత్సవాలు పురస్కరించుకుని ఫిబ్రవరి 3వ తేదీ వరకు పది రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీరామచంద్ర మిషన్ ఛైర్మన్, ప్రపంచ ధ్యాన గురువు కమలేష్‌ డి పటేల్ - దాజీ ధ్యానంతో మ్యూజికల్ ఫెస్టివల్ ప్రారంభమైంది. తాను రాసిన ఐకానిక్ "ది విజ్డమ్ బ్రిడ్జ్", "వేదాలు, ఉపనిషత్తుల నుంచి కథలు", "హార్ట్‌ఫుల్‌నెస్‌", "భండారి" పుస్తకాలతోపాటు 2023 సంవత్సరం క్యాలండర్‌ను దాజీ ఆవిష్కరించారు.


తొలిరోజు ప్రఖ్యాత సంగీత విధ్వాంసురాలు కౌశికి చక్రవర్తి గాన కచేరితో ఈ సంగీత పండుగ నిర్వహించారు. వారం రోజులపాటు 8 మంది ప్రఖ్యాత సంగీత విధ్వాంసులు, కళాకారుల నేతృత్వంలో ప్రదర్శనలు ఘనంగా జరగనున్నాయి. ప్రతిష్టాత్మక ఈ మ్యూజికల్ ఫెస్టివల్ కార్యక్రమానికి భారతదేశంసహా 132 దేశాల నుంచి అభ్యాసీలు, ఔత్సాహికులు తరలి వచ్చారు. హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్నర్‌పీస్ మ్యూజియం కూడా  ప్రారంభిమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: