ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారు. అయితే పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. దీనిపై మంత్రి అమర్‌నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం బాలాసోర్‌లో నిర్వహించారు.

విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదట. ఇప్పటికీ తమ వారి ఆచూకీ ల‌భ్యం కానివారు 83339 05022 వాట్సాప్‌కు వారి ఫొటోలు పంపించాలని కోరారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో 309 మంది ఏపీకి చెందినవారు ప్రయాణించారట. ఏపీ నుంచి హౌరా వైపు 33 మంది ప్రయాణించారట. 342 మందిలో ఇప్పటివరకు 331 మందిని గుర్తించారట. ఇంకా 11 మందిని గుర్తించాలట.


మరింత సమాచారం తెలుసుకోండి: