ఇబ్రహీంపట్నం ఫెర్రీలో మత్స్యకారుల స్వప్నం సాకారం అవుతోంది. అక్కడ గంగపుత్రుల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దొరుకుతోంది. ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫిష్ ఆంధ్ర పథకంలో భాగంగా మత్స్య ఉత్పత్తుల విక్రయ దుకాణాలు నిర్మించబోతున్నారు. ఈ నిర్మాణాలకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఇటీవల శంకుస్థాపన చేశారు. కృష్ణానదీ తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దుకాణాల రానున్నాయి.

ఇక్కడ మత్స్యకారుల కోసం 45 దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. సబ్సిడీతో పాటు, రుణ సదుపాయాలు కల్పించి, కొంత లబ్దిదారుని వాటాతో ఇక్కడ దుకాణాలు నిర్మిస్తున్నారు. అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అర్హతలను బట్టి దుకాణాలను కేటాయిస్తారు. నదిపై, అందులో లభించే మత్స్య ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గంగ పుత్రులకు నది ఒడ్డున నిర్మిస్తున్న ఈ దుకాణ సముదాయం ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు మాసాల వ్యవధిలో ఈ దుకాణ నిర్మాణాలు పూర్తి చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: