జగనన్న అమ్మఒడి 2022–23 పథకం డబ్బు ఈ నెల 28న జమ జగన్ ప్రభుత్వం చేయబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. పిల్లలను పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు పంపుతున్న తల్లుల ఖాతాల్లో ఈ నగదును ప్రభుత్వం వేస్తుంది. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండానే తల్లి లేదాసంరక్షకుడి ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున పొందచ్చని కొత్త నిబంధనలు చెబుతున్నాయి.

తాజాగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు తల్లులు పథకానికి అర్హులుగా ఉంటారు. పేదరికంలో ఉన్న కుటుంబాల ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10 వేలు మించకూడదని ఉత్తర్వుల్లో చెప్పారు. అదే పట్టణాల్లో రూ.12 వేలుకు మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అలాగే పదో తరగతి తర్వాత కూడా ప్రభుత‌్వ సొమ్ము వారికి వస్తుంది. అది ఎలాగంటే..  ఇంటర్మీడియెట్‌ కాకుండా పాలిటెక్నిక్, ట్రిపుల్‌ ఐటీ వంటి కోర్సుల్లో చేరే వారికి జగనన్న విద్యాదీవెన రూపంలో అందిస్తారు. అలాగే వసతి దీవెన పథకాలను కూడా వీరికి అమలు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: