తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పటి నెలలో సగం నెల గడిచినా ప్రభుత్వ ఉధ్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్‌ రాలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నెలంతా కష్టపడి ఉద్యోగం చేసిన ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.


ఒకటో తేదీకి వేతనాలు రాకపోవడంతో జీతంపై ఆదారపడిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఒకటో తేదీ జీతాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని... భూములు, మద్యం ఓ ఆర్ ఆర్ పై వచ్చిన డబ్బంతా బీఆర్ఎస్ కార్యకర్తలకు దోచిపెడుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: