నిజం గెలవాలి పేరుతో పర్యటన చేయబోతున్న నారా భువనేశ్వరి తాజాగా ఓ భావోద్వేగమైన పోస్టు సోషల్ మీడియాలో పెట్టారు. చంద్రబాబు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళానని...ఈ ప్రయాణం భారంగా ఉందని ఆ పోస్టులో నారా భువనేశ్వరి తెలిపారు. దేవుడి దయతో నిజం గెలుస్తుంది అని న్నమ్ముతున్నానన్న నారా భువనేశ్వరి.. నా భర్త చంద్రబాబు నాయుడు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళానని గుర్తు చేసుకున్నారు.


ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళానని.. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించిందని.. ప్రతి నిమిషం భారంగా గడిచిందని నారా భువనేశ్వరి తెలిపారు. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నానన్న నారా భువనేశ్వరి.. దీనిలో భాగంగా చంద్రగిరిలో తొలి అడుగు వేస్తున్నానని తన యాత్ర గురించి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: