ఏపీలో దొంగ ఓట్లు చేర్పిస్తున్నారట.. టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని... టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించడంలో సిద్ధహస్తులని... ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనేది టీడీపీ ఆలోచన అని మంత్రులు జోగి రమేష్‌, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుందన్న మంత్రులు.. టీడీపీ నేతలు అక్రమ మార్గంలో గెలిచేందుకే ప్రయత్నిస్తున్నారని అన్నారు.

చాలమందికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయని.. వాటిని తొలగించాలని ఈసీని కోరామని.. ఎవరికైనా సరే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాల‌ని వైసీపీ మంత్రులు పేర్కొన్నారు. హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయని... ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందించామని... డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరామని... దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానమని వైసీపీ మంత్రులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: